టాలీవుడ్ ప్రముఖ సింగర్లలో ఒకరైన కల్పన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కల్పన సింగర్ గా మాత్రమే కాక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా సుపరిచితం అనే సంగతి తెలిసిందే. కల్పన తాజాగా నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కల్పన ఆత్మహత్యాయత్నం ఇండస్ట్రీలో ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.
 
ఎక్కువ మొత్తంలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల ఆమ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం అందుతోంది. రోజూ వేసుకునే నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో వేసుకోవడం వల్లే ఆమెకు ఈ సమస్య ఎదురైందని ఆమె భర్త ప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
అయితే కల్పనకు భర్తతో సమస్య కాదని కూతురుతో సమస్య అని తెలుస్తోంది. కూతురిని హైదరాబాద్ రావాలని కల్పన కోరగా ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో కల్పన హర్ట్ అయ్యి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కల్పన కోలుకున్న తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
 
కల్పన కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఎంతో ధైర్యంగా ఉండే కల్పన ఈ విధంగా చేయడం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్పన జీవితంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్పనకు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గతంతో పోలిస్తే ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.  కల్పనకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి సపోర్ట్ లభించాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కల్పనకు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.




 


మరింత సమాచారం తెలుసుకోండి: