టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్న విశ్వక్ సేన్ కు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలు అయితే దక్కలేదనే సంగతి తెలిసిందే. కలెక్షన్ల విషయంలో లైలా తీవ్రస్థాయిలో నిరాశపరచగా విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. పలు వివాదాలలో చిక్కుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది.
 
రిలీజ్ రోజున మార్నింగ్ షోకే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ, కథనంతో తెరకెక్కడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు. ఆహా ఓటీటీ నుంచి అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడింది. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఆకాంక్ష శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం గమనార్హం. లైలా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నిరాశ పరిచిందనే సంగతి తెలిసిందే.
 
లైలా సినిమాలో సోనూ అలియాస్ సోనూ మోడల్ పాత్రలో కనిపించారు. విశ్వక్ సేన్సినిమా కోసం ఎంతో కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం అయితే దక్కలేదు. ఈ సినిమాలో బూతులు ఎక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. లైలా సినిమా తెలుగులో మాత్రమే రిలీజ్ కాగా విశ్వక్ సేన్ కెరీర్ లో మాయని మచ్చగా నిలిచింది. విశ్వక్ సేన్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
 
లైలా సినిమా నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో విశ్వక్ సేన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. లైలా సినిమా నష్టాలు షైన్ స్క్రీన్స్ బ్యానర్ కు ఒకింత భారీ షాకిచ్చాయి. లైలా సినిమా ఈ ఏడాది భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటి. విశ్వక్ సేన్ తన సినిమాలకు సంబంధించి వివాదాలకు దూరంగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: