సినిమా ఇండస్ట్రీ లో అత్యంత డేంజర్ జోన్ లో ఉండేది డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అని అనేక మంది అభిప్రాయాలను వ్యక్త పరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాత గా సినిమాలను నిర్మించి ప్రస్తుతం కూడా ఓ వైపు డిస్ట్రిబ్యూటర్ గా మరో వైపు నిర్మాత గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఇక తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయనకు మీరు కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కెరియర్ను కొనసాగించి ఉండుంటే ఇంత కాలం పాటు ఇండస్ట్రీ లో ఉండేవారా ..? అనే ప్రశ్న ఎదురయింది. దీనికి దిల్ రాజు సమాధానం చెబుతూ ... కేవలం నేను డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగించి ఉంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉండే వాడిని కాదు. ఎప్పుడో నా కెరీర్ క్లోజ్ అయ్యేది. ఉదాహరణకు ... నేను ఒక సంవత్సరం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను కొనుగోలు చేసి విడుదల చేశాను. ఆ సినిమాల ద్వారా నాకు 25 కోట్ల నష్టం వచ్చింది. కానీ అదే సంవత్సరం నేను  నిర్మించిన చాలా సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఆ సినిమాల ద్వారా నాకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. ఇక నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ను మాత్రమే అయి ఉంటే ఆ స్టార్ హీరోల సినిమాల ద్వారా వచ్చిన నష్టాలతోనే నా కెరియర్ క్లోజ్ అయ్యేది.

కానీ నేను నిర్మాతగా కూడా ఉన్నాను కాబట్టే ఆ సంవత్సరం నాకు వచ్చిన లాభాలతో నాకు వచ్చిన నష్టాలను పూడ్చుకున్నాను. అలా నేను డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా కొనసాగి ఉండకపోతే నా కెరియర్ చాలా సంవత్సరాల క్రితమే క్లోజ్ అయ్యేది అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం కూడా దిల్ రాజు అనేక సినిమాలను నిర్మిస్తూ , అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: