టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇకపోతే ఈయన తన కెరియర్లో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం వెంకటేష్ ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు పెళ్ళాల మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో భార్యకు మాజీ ప్రియురాలికి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ నటించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇదే జోనర్ లో ఒక మంచి క్రేజ్ ఉన్న హీరోతో ఓ సినిమా చేయాలి అని ఓ దర్శకుడు భావిస్తున్నట్లు , అందుకు సంబంధించిన కథను కూడా ఆల్మోస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ మరికొన్ని రోజుల్లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కిషోర్ తిరుమల , రవితేజ తో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు , సంక్రాంతికి వస్తున్నాం ఫార్మేట్ కథతో సినిమా చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు , అందులో భాగంగా ఒక కథను కూడా రెడీ చేసినట్లు , ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: