ఇప్పటికే వేసవికాలం ఎండలు ఫిబ్రవరి సగం నుంచే మొదలైపోయాయి .. ఎండల వేడికి ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు .. ఈ మండే ఎండలోనో మన హీరోలు ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు .. షూటింగ్స్‌ విషయంలో నో  కాంప్రమైజ్ అంటున్నారు .. చిరంజీవి నుంచి మొదలు పెట్టి ప్రతి హీరో షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు .. ప్రజెంట్ ఏ హీరో ఎక్కడ ఉన్నారు .. ఎవరు ఏ సినిమా తో బిజీగా ఉన్నారు .. అనేది ఇక్కడ తెలుసుకుందాం . ఇక ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా లో ఓ పాట చిత్రీకరణ ప్రజంట్ హలో నేటివ్ స్టూడియో లో జరుగుతుంది ..


అలాగే అక్కడే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఆనంద్ దేవరకొండ హీరో గా ఆదిత్య హాసన్ తెర్కక్కిస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది . ఇక రవితేజ మాస్ జాతర .. సంపత్ నంది , శర్వానంద్ సినిమాల సెట్ వర్క్ అదే స్టూడియో లో  జరుగుతుంది . ప్రభాస్ రాజా సాబ్ .. అటు ఫౌజీ సినిమాలకు డేట్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు .. అలాగే విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న కింగ్డమ్ షూటింగ్ కూడా పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది .. ఇక రామ్ పోతినేని , మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ప్రజెంట్ రాజమండ్రి లో జరుగుతుంది ..


ఇక సాయిధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టులోని  కీలక సన్నివేశాలు చిత్రీకరణ తుక్కుగూడలో జరుగుతుంది .. ఇక నిఖిల్ పిరియాడిక్  మూవీ స్వయంభు షూటింగ్ జన్వాడలో జరుగుతుంది .. అలాగే తేజ సజ్జ మిరాయ్ షూట్ ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ లో తెర‌క్కిస్తున్నారు .. అలాగే సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ కోలీవుడ్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది .. ఇలా ఈ మండే ఎండల్లో కూడా మన హీరోలు డోంట్ కేర్ అంటూ వ‌రుస సినిమా షూటింగుల్లో దూసుకుపోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: