ఐశ్వర్యరాయ్ అంటే పేరు మాత్రమే కాదు .. ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ .. ఆమె అందం అభినయం , అంతా కలిపి ఆమెను ఊహించని రేంజ్కి తీసుకువెళ్లాయి .. 1994లో విశ్వసుంద‌రిగా గెలిచిన ఐశ్వర్యారాయ్ .. తన అందంతో ప్రపంచాన్ని కట్టిపడేసింది .. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది .. ప్రపంచ సుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్యరాయ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి .. తమిళం , హిందీ సినిమాలో నటించి తన నటన ప్రతిభను చాటుకుంది . అలాగే ఆమె నటించినా చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకున్నాయి .. దేవదాస్ సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది ..


అలాగే జోధా అక్బర్ సినిమాలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను కూడా ఎంతో అద్భుతంగా నటించింది .. బాలీవుడ్ హీరో సల్మాన్ తో కలిసి జై హో సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించింది .. ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది . ఈ జంటకు ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది .. అయితే పెళ్లికి ముందు ఐశ్వర్యరాయ్ పలువురుతో ఎఫైర్ పెట్టుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే . బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయితో  పాటు .. బాలీవుడ్ స్టార్ సల్మాన్ తోను ఐశ్వర్య ప్రేమాయణం నడిపింది .. ఐశ్వర్యరాయ్ తన ఎఫైర్లు ఇప్పుడు దాచి పెట్టాలని అనుకోలేదు .. అయితే ఐశ్వర్య గతంలో భారతీయ కుబేరుల్లో ఒకరైన అనిల్ అంబానీ మధ్య ఎఫైర్ గురించి ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి .. ఐశ్వర్య , అనిల్ అంబానీతో డేటింగ్ చేస్తున్నట్టు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో తెగ వార్త‌లు వచ్చాయి ..


ఐశ్వర్యరాయ్ , అనిల్ అంబానీల మధ్య సంబంధం ఉందనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది . అయితే దీనిపై గతంలో మీడియా ఐశ్వర్యాన్ని ప్రశ్నించగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది .. నా పేరును పదే పదే ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కావటం లేదంటూ మీడియాపై కూడా ఐశ్వర్య అసహనం వ్యక్తం చేసింది .. అనిల్ అంబానీ ని తాను చాలా తక్కువసార్లు కలిశానని అంతకుమించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది .. అయితే అప్పటికే అంబానీ నటి టీనా మునిమ్‌ను పెళ్లి చేసుకున్నారు .. రిలయన్స్ కమ్యూనికేషన్ లో ఒక వెలుగు వెలుగున అనిల్ అంబానీ ఆ తర్వాత దివాలా తీసే పరిస్థితి కూడా వెళ్లారు .. అన్న ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లిలో ఓ సాధారణ వ్యక్తిగా కనిపించి అనిల్ అంబానీ అందరికీ షాక్ ఇచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: