ప్రముఖ కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది .. ఇక దాంతో ఆమెను మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరపరిచారు .. అయితే రన్యా రావును మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి  తరలించాలని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది .. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు న్యాయమూర్తి  ఈ ఆదేశాలు జారీ చేశారు .. ‘మాణిక్య’, ‘పటాకి’ వంటి కన్నడ హిట్ సినిమాలో నటించిన రన్యా .. ఇప్పుడు జైలు పాలు అయింది ..
 

అయితే రన్యా సోమవారం రాత్రి దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయాని కి వచ్చింది .. అక్కడ డిఆర్డిఏ అధికారులు ఈమెను అరెస్ట్ చేశారు .  అలాగే విచారణ కోసం రన్యా ను కస్టడీకి ఇవ్వాలని డిఆర్డిఏ అధికారులు కూడా కోరారు .. అయితే నాయిమూర్తి ఆమెని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కి పంపాలని ఆదేశాలు ఇచ్చారు .. ఇక జ్యుడీషియల్ కస్టడీ కి తరలించే ముందు ఈ హీరోయిన్ కు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు .. బౌరింగ్ ఆసుపత్రి లో నటికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు .

 

ఇక రన్యా  ఐపీఎస్ అధికారి రామచంద్ర రావు కుమార్తె .. పలు వ్యాపార ప‌నుల‌ కోసం దుబాయ్ వెళుతున్నానని ఆమె చెప్పింది .. అయితే ఆమె బంగారం కడ్డీలతో బెంగళూరుకు వచ్చింది .. ఢిల్లీ DRI  బృందానికి రన్యా స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం తెలిసింది . ఇక దాంతో మార్చి 3 న డిఆర్డిఏ అధికారులు రన్యా రాకకు రెండు గంటల ముందే విమానాశ్రయాని కి వెళ్లారు .. రన్యా దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానం లో బెంగళూరు వచ్చింది .. ఇక సోమవారం సాయంత్రం 7:00 సమయం లో బెంగళూరు విమానాశ్రయం లో డిఆర్డిఏ అధికారులు ఈ హీరోయిన్ ను అరెస్ట్ చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: