టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు పొందిన అనుష్క శెట్టి గత కొంతకాలంగా సినిమాల కథల ఎంపిక
విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే అనుష్క కొంతమేరకు కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తన పాత్ర ప్రాధాన్యత ఉండే సినిమాలను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం అనుష్క ఘాటి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వేదం తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ల ఈ సినిమా రావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.


అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నదట.ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇతరత్న ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా ఈ సినిమాకి కలిసొస్తోందట. ఇందులో అనుష్క పాత్ర కూడా చాలా రూత్ లెస్, స్టన్నింగ్ అవతార్గా కనిపించబోతోందట. ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సినిమా టీజర్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


ఏప్రిల్ 18న ఘాటి సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ని సైతం వేగవంతం చేయలేదు దీంతో కొంతమేరకు అభిమానులలో కూడా టెన్షన్ మొదలయ్యిందట. కానీ తాజాగా వినిపించిన సమాచారం ప్రకారం అనుష్క కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి సిద్ధంగా ఉందని ఈ నెల మధ్యలో నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అనుష్క ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నది. ప్రతి సినిమాకి కూడా ప్రమోషన్ ఎంత ముఖ్యమో ఇటీవలే విడుదలైన సినిమాలను చూస్తే మనకి అర్థమవుతుంది.. మరి అనుష్క కెరియర్లో ఘాటి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: