
అయితే ఈ పైరసీని ఎన్నోసార్లు చాలామంది నిర్మాతలు దర్శకులు హీరోలు సైతం అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసినా కూడా వేయలేకపోయారు. దీంతో థియేటర్స్ యాజమాన్యం కూడా భారీగానే నష్టపోతున్నారు. వీటికి తోడు ఓటిటి సంస్థల వల్ల కూడా థియేటర్ స్ చాలానే నష్టాలలో కూడా నడుస్తూ ఉన్నాయట. ఇటీవలే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో సైతం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పైరసీ పైన పలు వ్యాఖ్యలు చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ పైరసీపై ఎవరి సినిమా ఎఫెక్ట్ పడితే వారు మాత్రమే మాట్లాడుతున్నారు..అయితే వారు మాట్లాడిన మాటలు శుక్రవారం మాట్లాడితే సోమవారానికి మర్చిపోతున్నారని.. దానిని అడ్డుకోకపోతే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక ఉద్యమంలో అడ్డుకోవాలి అంటూ తెలిపారు. తాను ఈ విషయం మీద లీడ్ చేస్తానని నిర్మాతలు అందరూ కలిసి రావాలని.. ఇందులో డబ్బులు పోగొట్టుకునేది నిర్మాతలే కాబట్టి అందరూ అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అంతేకాకుండా ఒక నిర్మాతగా పంపిణీదారుడుగా ఒక ఏడాది పాటు అన్నిటిని చూసుకుంటాను అలా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే పైరసీ అనేది అరికట్టగలమంటూ తెలిపారు దిల్ రాజు. మరి దిల్ రాజు చెప్పిన వ్యాఖ్యలకు ఏ మేరకు పైరసీభూతాన్ని అరికట్ట గలరో చూడాలి.