ఏంటి అనుష్క ఆ హీరోతో ఏడాది పాటు ఒకే రూమ్లో కలిసి ఉందా..నిజంగానే ఇద్దరు సంవత్సరం పాటు సహజీవనం చేశారా.. ఇంతకీ అనుష్క కలిసి ఉంది ఏ హీరోతో అనేది ఇప్పుడు చూద్దాం.. అనుష్క ఏడాది పాటు ఓకే హీరోతో కలిసి ఉంది అంటే అందరూ ప్రభాస్ అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే అనుష్క ఏడాది పాటు కలిసి ఉన్న హీరో ప్రభాస్ ఐతే కాదు.మరి ఇంకెవరితో కలిసి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.టాలీవుడ్లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.కన్నడ భామ అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా ఫేమస్ అయింది.అయితే అలాంటి ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చాక ప్రభాస్, నాగార్జున, గోపీచంద్ వంటి హీరోలతో ఎఫైర్ వార్తలు వినిపించాయి. కానీ అనుష్క ప్రభాస్ తో మాత్రమే ఇప్పటికీ తన రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే గతంలో అనుష్క గోపీచంద్ కాంబోలో శౌర్యం, లక్ష్యం వంటి రెండు సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమాలో నటించే సమయంలోనే అనుష్క గోపీచంద్ ఇద్దరు ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపించాయి. అయితే వీరి ప్రేమ వార్తల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుష్క గోపీచంద్ తో ఏడాది పాటు ఒకే రూమ్లో సహజీవనం చేసింది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఇల్లు మా ఇంటి వెనకాలే ఉండేది.. అయితే సంవత్సరం పాటు గోపీచంద్ తో ఉన్న అనుష్క ఆ తర్వాత ప్రభాస్ మాయలో పడిపోవడంతో ఈ విషయం తెలిసి ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు గొడవపడ్డారు. వీరిద్దరూ రెండు మూడు సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు కూడా.. దానికి కారణం అనుష్కని ప్రభాస్ వలలో వేసుకోవడమే. అందుకే ప్రభాస్ గోపీచంద్ లు ఆ మధ్యకాలంలో గొడవలు పెట్టుకున్నారు.. అంటూ డైరెక్టర్ గీత కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈయన వ్యాఖ్యలు మీడియాలో ప్రస్తుతం మళ్ళీ వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ ఇది నిజమేనా.. అనుష్క గోపీచంద్ తో నిజంగానే సహజీవనం చేసిందా..ప్రభాస్ వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారా..గీతకృష్ణ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆ మధ్యకాలంలో ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కలిసి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి వచ్చిన సమయంలో కూడా మీరిద్దరూ ఓ హీరోయిన్ గురించి గొడవపడ్డారట. ఎందుకు అది నిజమేనా అని అడగగా..అదేం లేదు అని అన్నారు. ఇక హీరోయిన్ తో గొడవ అనగానే అందరూ త్రిష అనుకున్నారు. కానీ అనుష్క పేరు అయితే అనుకోలేదు. అలాగే వర్షం సినిమాలో హీరోయిన్ త్రిష కోసం ప్రభాస్ గోపీచంద్ గొడవ పడతారు కాబట్టి ఇదే కావచ్చు అని చాలామంది మైండ్లో మెదిలింది. కానీ అనుష్క కోసం అని అయితే ఎవరు ఊహించలేదు. ఇక ఎవరు ఊహించని నిజాన్ని బయటపెట్టారు గీతకృష్ణ. కానీ ఆ మాటల్లో ఉన్నది ఎంత నిజమో మాత్రం తెలియదు

మరింత సమాచారం తెలుసుకోండి: