
అయితే ఈ షూటింగ్ అయిపోయిందని కూడా అన్నారు .. ఇప్పుడు మళ్లీ ఈ షూట్ ఏంటి అనే డౌట్ చాలా మందికి రావచ్చు .. అయితే పుకార్లే నిజమయ్యాయి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని ఆ పాట షూటింగ్ కూడా మొదలైందని అంటున్నారు .. బాస్కో మార్టిస్ దీనికి కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది . ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోస్ లో ఈ పాట కోసం భారీ సెట్ రెడీ చేశారట .. ఇక ఈ పాటలో హీరోలతో పాటు దాదాపు 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారని తెలుస్తుంది .. ఆరు రోజుల పాటు షూటింగ్ ఉంటుందట ..
ఎన్టీఆర్ , హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్లే అనే విషయం అందరికి తెలిసిందే .. అలాంటి ఇద్దరు కలిసి ఒక పాట కోసం కలిసి చిందేస్తే అదొక గొప్ప విషయమనే చెప్పాలి .. ఇప్పుడు అలాంటి ఫీట్‌నే వార్ 2 సినిమాతో దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసుకువస్తున్నారు . ఇక ఈ పాన్ ఇండియా సినిమాని యాష్ రాజ్ ఫిలిం నిర్మిస్తుండగా ఇందులో కియారా అడ్వాణీహీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉంది .. అయితే బాలీవుడ్ సినిమాలు గతంలో మాదిరి ఈ మధ్య అనుకున్న టైం కి రావడం లేదు .. ఇక మరి చూడాలి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ?