హర్యానాలోని ఓ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో పుట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ .. దాంతో ఇంట్లోనే ఎంతో కఠినమైన రూల్స్ ఉండేవి .. అయితే ఈ మల్టీ టాలెంటెడ్ భామకు అవేమీ అడ్డు రాలేదు .. ఒకవైపు చదువుకుంటూనే క్రీడల్లో కూడా రాణించింది . స్విమ్మింగ్ తో పాటు బ్యాట్మెంటన్లో స్టేట్ లెవెల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది .. అదే క్రమంలో మోడలింగ్ లోను తన లక్‌ను పరీక్షించుకుంది .. అల ప‌లు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా కూడా నిలిచింది .. ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, మిస్ ఇండియా పేజెంట్ టైటిల్స్ ను ఈమె గెలుచుకుంది .. ఇక తర్వాత చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టింది ..
 

మొదటలో చిన్న చిన్న సినిమాల్లో చేసిన ఇప్పుడు ఈ అమ్మడు రేంజ్ ఊహించని రేంజ్ కు వెళ్ళింది .. గత ఏడాది ఈమె నటించిన ఆరు సినిమాలో థియేటర్లోకి వచ్చాయి .. ఇక ఈ సంక్రాంతి సీజ‌న్‌లో ఈ ముద్దుగుమ్మదే హవా .. సంక్రాంతి బరిలో  నిలిచిన ఈమె సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది .. ఇప్పటికే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమయ్యే ఉంటుంది .. ఇంత‌కి ఆ బ్యూటీ మరెవరో కాదు సంక్రాంతి కోస్తున్నాం సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి.

 

మార్చ్ 5 బుధవారం అనగా ఈరోజు మీనాక్షి పుట్టినరోజు .. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు  ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు .. ఇదే క్రమంలో మీనాక్షి గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే .. గత సంవత్సరం ఈమె నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి .. వాటిలో లక్కీ భాస్కర్, ద గోట్ , గుంటూరు కారం వంటి సినిమాలు హిట్ అయ్యాయి . ఇక రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకుంది . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి . అందులో అనగనగా ఒక రాజు తో పాటు మరికొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: