సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసు మీడియాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది అనే విషయం తెలియగానే చాలామంది షాక్ అయిపోయి ఆమెని చూడడానికి ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆమెతోటి సింగర్స్ పరామర్శించి వస్తున్నారు. ఇక గత రెండు రోజుల నుండి రూమ్ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు వచ్చి డోర్ బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో బెడ్ పై పడి ఉన్న సింగర్ కల్పనను హాస్పిటల్కి చేర్చారు.ఇక కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందని,ఆమె స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోవాలని చూసిందని తెలియజేశారు.

ఈ విషయంలో భర్త పై అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. ఇక స్పృహలోకి వచ్చిన కల్పన తాను సూసైడ్ అట్టెంప్ట్ చేయడానికి ప్రధాన కారణం నా కూతురేనని..నా కూతురు కేరళ నుండి హైదరాబాద్ కి వచ్చి చదువుకోమంటే రనని  చెప్పింది.అందుకే ఆ బాధ భరించలేక స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను అని చెప్పింది. అయితే తాజాగా సింగర్ కల్పన పెద్ద కూతురు దయా ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు బయట పెట్టింది. మా అమ్మది సూసైడ్ కాదని,మా అమ్మ ఓవైపు సింగింగ్ ప్రోఫెషన్ ని కంటిన్యూ చేస్తూనే మరోవైపు ఎల్ ఎల్  బి, పిహెచ్డి వంటివి చేసింది.

అందుకే రెండు మూడు పనులు ఒకేసారి చేసేసరికి బాగా స్ట్రెస్ కి ఫీల్ అయింది. హాస్పిటల్ కి వెళ్ళగా ఆమెకి ఇన్సోమ్నియా అనే టాబ్లెట్ ని వైద్యులు రాశారు. అయితే ఈ టాబ్లెట్ ఓవర్డోస్ కారణంగానే మా అమ్మ అన్ కన్షియస్ లోకి వెళ్ళిపోయింది.అంతేకానీ మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు.మా నాన్నతో మా అమ్మకు ఎలాంటి గొడవలేదు. మీడియా అవస్తవాలను ప్రచారం చేయడం ఇప్పటికైనా ఆపండి. నా కారణంగా మా అమ్మ సూసైడ్ అట్టెంప్ట్ చేయలేదు అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది సింగర్ కల్పనా కూతురు దయా ప్రసాద్

మరింత సమాచారం తెలుసుకోండి: