
దానికి కారణం సల్మాన్ ఖాన్ సినిమాతో అట్లీ బిజీగా ఉండటమే అని వార్తలు కూడా వచ్చాయి .. అయితే ఆ సినిమా కన్ఫామ్ కాకపోవటంతో ముందుగా బన్నీ సినిమా కంప్లీట్ చేద్దామని అట్లీ భావించారట .. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఫ్రీ అవటంతో ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందట .. ఇక త్రివిక్రమ్ సినిమా లైనప్‌లో ఉన్నా కథ రెడీ కాలేదు .. అయితే ఈ విషయాలు పక్కనపడితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఇక ఈ సినిమాలో విదేశీ హీరోయిన్లు కూడా ఉండబోతున్నారట .. దీనికోసం సినిమా యూనిట్ ఇప్పటికే హీరోయిన్ల వేట మొదలు పెట్టినట్టు తెలుస్తుంది ..
ఇక త్వరలోనే విదేశీ హీరోయిన్లు ఇద్దరిని ఫిక్స్ చేయబోతున్నారటా .. ఆ తర్వాత మన దేశంలో మరో ఇద్దరు హీరోయిన్లు ఓకే చేస్తారని తెలుస్తుంది . అల్లు అర్జున్ ఈ సినిమా కోసమే విదేశాలకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకుని రీసెంట్ గానే ఇండియాకు వచ్చారు . జవాన్ లాంటి పాన్ ఇండియా హిట్ తరవాత .. ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్ప సినిమాల తర్వాత అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న AAA ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి .. ఎందుకంటే అట్లీ మాస్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తే ఏ రేంజ్ విజయనందుకుంటుంరో అందరికీ తెలుసు .. ఇక అల్లు అర్జున్ సంగతి సరేసరే మాస్ సినిమాలకి ఐకాన్ స్టార్ గా మారిపోయారు .