
కత్తి నాదే నెత్తురు నాదే .. యుద్ధం నాదే అనే క్యాప్షన్ తో గతంలో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది .. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో భారి వైలెన్స్ తో యాక్షన్ డ్రామాగా ఉంటుందని లీకులు కూడా వచ్చాయి .. కానీ అంతకుమించి ఎక్కువ డీటెయిల్స్ బయటకు రాలేదు . ప్రస్తుతం విజయ్ కింగ్డమ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు .. ఇది కంప్లీట్ అయ్యాక రౌడీ జనార్ధన షూటింగ్లోకి వెళ్లే అవకాశం ఉంది .. అలాగే వీటితోపాటు శ్యాంసింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ తో కూడా పాన్ ఇండియా సినిమాకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి .. ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు .
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్ దేవరకొండ పేరు జనార్ధనే .. తిరిగి దాన్నే ఇప్పుడు వాడుకోబోతున్నారు .. ఇది తండ్రి పేరు కాబట్టి సెంటిమెంట్ బాగా భావించి ఉండొచ్చు .. వరస ఫ్లాపులు ఎదుర్కొంటున్న రౌడీ హీరోకు సాలిడ్ విజయం ఎంతో అవసరం .. మార్కెట్ బిజినెస్ లెక్కలు పట్టించుకోకుండా కంటెంట్ డిమాండ్ చేస్తే ఈ హీరో మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు .. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే .. ఒక్కోదానికి అసలు సంబంధం లేని జానర్ లే .. ఈ అన్నిటి మీద పెడుతున్న బడ్జెట్ 300 కోట్లు పైనే ఉంటుందని టాక్.