అయితే మొదటి వారం కంటే రెండో వారంలోనే డాకు మహారాజ్ రెస్పాన్స్ మరింత ఎక్కువగా వచ్చినట్టుగా తెలుస్తుంది . మొదటి వారంలో నెట్ ఫ్లిక్స్ లో 2.4 మిలియన్ కి పైగా వ్యూస్ తెచ్చుకుంటే రెండో వారంలో దీనికి మించి 2.6 మిలియన్ వ్యూస్ ను అందుకున్నట్టుగా తెలుస్తుంది .. వీటికి తోడు రెండు వారాల్లో ఐదు మిలియన్ కి పైగా వ్యూస్ ని డాకు మహారాజ్ అందుకోవటం విశేషం . ఇక ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా లెవల్ లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ..
ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించుగా సితార ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు . బాలకృష్ణ కూడా వరుసగా అఖండ , విరసింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించాడు . ఇక డాకు మహారాజ్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు . మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాల్గవ సారి బాలయ్య సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు . దబిడి దిబిడి సాంగ్ ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రెండ్ అవుతూ పాటికి ఎంతోమంది రిల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు .