అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని..  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్... ఇప్పటివరకు పెద్ద హిట్ కొట్టలేకపోయాడు. పెద్ద హిట్ కాదు కదా... యావరేజ్ టాక్ కూడా ఏ సినిమా పైన తెచ్చుకోలేదు. ఎందుకో కానీ అఖిల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.  ఎన్నో విభిన్న కథలు ఎంచుకున్నప్పటికీ... సక్సెస్ కాలేకపోతున్నాడు అక్కినేని అఖిల్.

 అయితే.. తెలుగు ప్రేక్షకుల ముందుకు చివరగా ఏజెంట్ సినిమాతో అక్కినేని అఖిల్ రావడం... జరిగింది. ఈ సినిమా 2023 ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. దీంతో.... అక్కినేని అఖిల్ డీలా పడిపోయాడు. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా చేయగా... హీరోయిన్గా సాక్షి వైద్య కనిపించారు. మమ్ముట్టి కీలక పాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా సురేందర్ రెడ్డి.. పనిచేసినప్పటికీ పెద్దగా రిజల్ట్ రాలేదు.

 ఎన్నో స్టంట్స్... ఫైట్స్ అలాగే రకరకాల సీన్లు చేయడానికి అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. అయినప్పటికీ ఏజెంట్ మాత్రం సైలెంట్ అయిపోయింది. అయితే థియేటర్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా నెల రోజుల్లోపు.. Ott లోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఓటీటీ లోకి మాత్రం రాలేదు. ఈ సినిమాలు ఎవరు కొనుగోలు చేయలేదా..? అసలు రిలీజ్ చేయడానికి వెనుకాడారా ? తెలియదు కానీ ఈ సినిమా వెనక్కి వెళ్ళింది.

 అయితే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా గురించి తాజాగా కీలక ప్రకటన వచ్చింది. ఈ ఏజెంట్ సినిమా ఓటీటీ లోకి తాజాగా రాబోతున్నట్లు ప్రకటన విడుదలైంది. మార్చి 14వ తేదీన...సోనీ లివ్ ott ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి కొంతమంది ఈ సినిమాను ట్రోలింగ్ చేస్తున్నారు. 685 రోజుల తర్వాత రిలీజ్ అయిన తొలి సినిమా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: