
సెలబ్రిటీలు ప్రేమించుకోవడం... ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం... అవసరం అయితే విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందినవారు ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం మనం నిత్యం చూస్తున్నాం. అలాగే క్రికెటర్లు.. ఎఫైర్లు పెట్టుకోవడం... ఆ తర్వాత విడిపోవడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా.... ప్రేమలో పడి ఇప్పుడు ప్రియుడ్ని కూడా దూరం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ... ఇద్దరు కూడా దాదాపు రెండు సంవత్సరాలనుంచి ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు.. హింటు కూడా ఇచ్చారు. కానీ చివరికి ఏమైందో తెలియదు కానీ... తమ రిలేషన్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని... అలాగే సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను తమ తమ అకౌంట్ ల నుంచి డిలీట్ చేశారని కూడా అంటున్నారు. విడిపోయే సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారన్న సంగతి తెలిసిందే. వీళ్ళ విషయంలో కూడా అదే ప్రచారం జరుగుతోంది. ఇంకేముంది తమన్నా అలాగే విజయ్ వర్మ ఇద్దరు విడిపోబోతున్నారని... జోరుగా ప్రచారం అందుకుంది.
అయితే వీళ్ళు విడిపోతున్నారన్న వార్త రాగానే సోషల్ మీడియాలో మరో కథనం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. తమన్నా అలాగే విజయ్ వర్మ ఇద్దరు విడిపోవడానికి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో అని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను వదిలేసి ఆ తెలుగు హీరో చెంతన చేరిందట తమన్న. ఈ విషయం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు అస్సలు నచ్చలేదట. అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు... విడిపోబోతున్నట్లు.. తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.