
అయితే ఇంత జరుగుతున్న ఈ సినిమాని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది లేదు .. రాజమౌళి పలు ఈవెంట్లో దీని గురించి చెప్పడం తప్ప ఇంకెవరు స్పందించింది లేదు .. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్ చేసే టైంలోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి .. సినిమా వివరాలు అధికారికంగా తెలపటం అనేది రాజమౌళికి అలవాటు .. ఈసారి కూడా అదే చేసే అవకాశం ఉంది .. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు , రాజమౌళి సినిమా కోసం హైదరాబాదులో భారీ కాశి సెట్ వేస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది .
అయితే అది వట్టి ఫేక్ వార్త అని అంత అనుకున్నారు .. కానీ అది నిజమే అని లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది .. మహేష్ , రాజమౌళి సినిమా కోసం నిజంగానే హైదరాబాదులో కాశి సెట్ వేశారు .. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా మైథాలజీ కాన్సెప్ట్ తో ముడిపడి ఉంటుందని టాక్ వినిపిస్తుంది .. దాన్నిబట్టి కాశి సెట్ చూస్తుంటే ఇది నిజమేనేమో అని కూడా అంటున్నారు .. మరోపక్క ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.