టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే మూవీ తో మొదటి కమర్షియల్ విజయం సొంతం చేసుకున్నాడు. ఇక ఈయన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తర్వాత అనేక సినిమాలలో నటించాడు. కానీ అందులో ఒకటి , రెండు సినిమాలను మినహాయిస్తే ఏ మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి.

ఆఖరుగా కిరణ్ "క" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం క్రేజ్ భారీగా పెరిగింది. ఇక ప్రస్తుతం ఈ నటుడు దిల్రుబా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం తన తదుపరి మూవీ గా క ర్యాంప్ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కోసం కిరణ్ సరికొత్త లుక్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈయన ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీని డెవలప్ చేయనున్నట్లు , సిక్స్ ప్యాక్ బాడీ తోనే క ర్యాంప్ మూవీలో ఈయన కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఏకంగా 20 లిప్ లాక్ సన్నివేశాల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: