
అకిరా ఎంట్రీని ప్రముఖ నిర్మాత అశ్వని దత్ లాంచ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఎందుకంటే గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ ఎంతోమంది హీరోలను కూడా అశ్విని దత్తే నిర్మాతగా చేపట్టారట. అందుకే ఇప్పుడు అకిరా ఎంట్రీ బాధ్యత కూడా ఈయన మీదే ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం హీరోయిన్ గా మహేష్ బాబు కూతురు సితార అయితే బాగుంటుందనే విధంగా డిమాండ్ చేస్తున్నారట. ఇండస్ట్రీలో మొదటి నుంచి అటు మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహబంధం ఉన్నది.
ఈ క్రమంలోనే అకిరా కి జోడిగా సితార హీరోయిన్ పరిచయం చేయడానికి కూడా మహేష్ బాబు కచ్చితంగా అభ్యంతరం తెలపకపోవచ్చునే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీతారకి కూడా భారీగా క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే పలు రకాల యాడ్స్ వల్ల భారీగానే సంపాదిస్తుంది. ఇక ఈ సినిమా కూడా ఒకవేళ అన్ని కుదిరి విడుదలయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయం అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ధీమాతో ఉన్నారు. అకిరా ఎంట్రీకి తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వం వహించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి.