కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఈ పేరు మీరు అంతగా వినకపోయుండచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే సౌత్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది. తన నటనతో, అలాగే మేనరిజంతో అప్పటి ఇప్పటి యూత్ను తెగ ఆకట్టుకున్నారు. ఆరు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎదిగిన ఒదిగే ఉంటారు. స్వ‌యంకృషితో ఉన్న‌త స్థాయికి చేరుకున్న చిరంజీవిని ఎంతో మంది ఆద‌ర్శంగా కూడా తీసుకుంటారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. తన సినిమాల బ్యాక్ టూ బ్యాక్ అప్ డేట్స్‌తో జోష్ పెంచుతున్నారు. ఇక సినిమా నిర్మాణంతో పాటు.. ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికి సుప‌రిచిత‌మే. ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సులని గెలుచుకున్నారు. అయితే అప్పుడ‌ప్పుడు చిరంజీవికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విషయాలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి.చిరంజీవికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయో తెలుసుకోవాల‌నే ఆసక్తి అంద‌రిలో ఉంటుంది.

సినిమాల‌లో మెగాస్టార్‌గా ఎన్నో కీర్తి ప్ర‌తిష్ట‌లు సాధించిన చిరంజీవి చ‌దువులో ఏ ర్యాంక్ సాధించారు అనేది తెలుసుకోవాల‌నే ఉత్సాహం అంద‌రిలో ఉంటుంది. ఈ క్ర‌మంలో చిరంజీవి 10th సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ స‌ర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వ‌ర‌ప్ర‌సాద్ రావు అని రాసి ఉండ‌గా, తండ్రి పేరు వెంక‌ట్ రావు అని ఉంది. చిరు పెనుగొండ‌లో పుట్టార‌ని దాని ద్వారా అర్ధ‌మ‌వుతుంది. అయితే పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లో మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మాత్రం ఇందులో లేదు. కనిపించడం లేదు. ఇప్పుడీ స‌ర్టిఫికేట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.ఇది చూసిన అభిమానులు దానిని భ‌ద్రంగా దాచుకుంటున్నారు. ఇక చిరంజీవి సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ కాంబినేషన్ లో విశ్వంభ‌ర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ మూవీని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే రీఎంట్రీలో చిరంజీవి అంత హవా చూపించ‌డం లేదు. బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ వంటి హీరోలు మంచి హిట్స్ అందుకుంటున్నా చిరంజీవి రేంజ్‌కి త‌గ్గ హిట్ అయితే రావ‌డం లేదు. విశ్వంభ‌రతో అయిన చిరంజీవి మ‌ళ్లీ పున‌ర్వైభవం అందుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: