మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సాయిధరమ్ తేజ్ సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా కొట్టడం విశేషం. డిఫరెంట్ కథలతో వస్తూ ప్రేక్షకులను తేజ్ అలరిస్తున్నాడు. ఫ్యామిలీ, మాస్, హర్రర్ ఇలా అన్ని రకాల జోనర్స్ ట్రై చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మరో సినిమా 'సంబరాల ఏటిగట్టు'. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే తేజ్ నటిస్తున్న కార్నేజ్ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ పాత్ర ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా యాక్షన్ సన్నివేశాలను భారీ సెట్ లో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎంతో రిస్క్ తో ఈ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాలు ఉన్నట్టు సమాచారం. కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా సినిమాలోని పాటలను కూడా ఓ రేంజ్ లోనే చిత్రీకరిస్తున్నట్టు ఫిలింనగర్లో వార్తలు చుక్కలు కొడుతున్నాయి.
ఈ సినిమాకు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా ఎంట్రీ సాంగ్ కోసం ఏకంగా వెయ్యి మంది డాన్సర్లు స్టెప్పులు వేయబోతున్నట్టు సమాచారం. వారందరితో కలిసి సాయి ధరమ్ తేజ్ కూడా స్టెప్పులు వేస్తారట. ఈ పాట సినిమాకి హైలెట్ గా నిలుస్తోందని సమాచారం. ఇక 125 కోట్ల బడ్జెట్ తో ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయమన్నారు. ఈ సినిమా గనక హిట్ కొడితే మెగా అల్లుడి రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: