
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు అనుమానాలు ఉండేవి కానీ.. తాజాగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ విషయానికొస్తే 1960స్ బెంగాల్ నేపథ్యంలో సాగే ఒక నాయకుడి కథ ఇది. గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలవబడే సముద్రతీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా బేస్డ్‌గా డ్రాగన్ తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డ్రాగన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. తనకి తగ్గట్టుగానే మేకింగ్ కూడా ఉండబోతుంది.
గోల్డెన్ ట్రయాంగిల్ అనే సముద్రతీర ప్రాంతం అంటే.. ఇందులోనూ సముద్రమే స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. దీనికోసం హాలీవుడ్ టీం పని చేస్తున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉండే నల్ల సముద్రం సమీప ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదంతా చూస్తుంటే డ్రాగన్ అటాక్ చాలా భారీగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. కారణం తెలియదు కానీ దేవర తర్వాత తారక్ ఎంచుకుంటున్న కథల్లో తెలియకుండానే సముద్రం వచ్చేస్తుంది. బాలీవుడ్ సినిమా వార్ 2లో కూడా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే ఉన్నాయి. మొత్తానికి అలా తెలియకుండానే సముద్ర పుత్రుడు అయిపోతాడు జూనియర్ ఎన్టీఆర్. పోనీలే ఏదో ఒకటి.. సెంటిమెంట్ కలిసొచ్చి సినిమా హిట్ అయితే చాలు అనుకుంటున్నారు అభిమానులు.