యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తీసిన 'హనుమాన్' సినిమా ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇక దీపావళి సందర్భంగా ఇటీవల ప్రశాంత్ వర్మ ఓ సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. కన్నడ స్టార్‌, కాంతార ఫేమ్ హీరో రిషబ్‌ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రిషబ్ శెట్టిని హనుమంతుడిగా చూసి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. అయితే ఆ ఫోటో జై హనుమాన్ ఫస్ట్ లుక్ కోసం చేసిన ఫోటోషూట్స్ నుంచి పోస్ట్ చేసిందని తెలుస్తుంది. షూటింగ్ త్వరలోనే మొదలవ్వనున్నట్టు సమాచారం. రిషబ్ శెట్టి కాంతార 2 అవ్వగానే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.ఐతే కాంతారా ప్రీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి జై హనుమాన్ కు ఇంకా డేట్స్ ఇవ్వలేదు. ఐతే జై హనుమాన్ సినిమాను 2025 అంటే ఈ ఇయర్ రిలీజ్ చేయాలని అనుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు సినిమా షూటింగ్ లేట్ అవ్వడం తప్పదని గ్రహించాడు.అంతేకాదు ఈలోగా తను రాసిన ఒకటి రెండు కథలను వేరే దర్శకులకు ఇస్తూ అలా కూడా మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఐతే జై హనుమాన్ విషయంలో ప్రశాంత్ కాలిక్యులేషన్స్ అన్నీ తప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అసలైతే ఈ టైం కి షూటింగ్ సగానికి పైగా పూర్తి చేయాలని అనుకోగా అది జరగలేదు. అంతేకాదు ఏం చేయాలన్నా కూడా రిషబ్ డేట్స్ మీద ఆధారపడి ఉంది.

అందుకే ప్రశాంత్ వర్మ సినిమా విషయంలో కాస్త టైం తీసుకునేలా ఉన్నాడని తెలుస్తుంది. సో చూస్తుంటే జై హనుమాన్ 2025 కాదు 2026 దాకా ఇంకా లేట్ అయితే మరో ఏడాది అంటే 2027 దాకా తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది. హనుమాన్ సినిమా అంటే తేజా సజ్జా తో పాటు మిగతా సీజీ వర్క్ తో పూర్తి చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ రిషబ్ శెట్టితో చేస్తున్న జై హనుమాన్ మాత్రం అంత తేలికగా పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు.అందుకే ఈ సినిమా అనుకున్న టైం కన్నా లేట్ గా వచ్చేలా ఉందని తెలుస్తుంది. ఐతే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుందన్నట్టుగా ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ విషయంలో కూడా లెక్క ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నాడని తెలుస్తుంది.రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కన్నడ హీరో అయినా రిషబ్ శెట్టి కాంతార సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన అందర్నీ ఆకట్టుకుంది. కాంతార సినిమాకు కాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రిషబ్ శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: