మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతోన్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్‌తో ముస్తాబవుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీపై ఏ అప్ డేట్ వచ్చినా హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా.. నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఈ మూవీపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' మూవీ సక్సెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ నీల్ మూవీపై ప్రశ్నలు ఎదురవగా సమాధానం ఇచ్చారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ అని.. ఇది ఓ ప్రత్యేకమైన స్క్రిప్ట్ అని చెప్పారు. 'ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో చూడని యునిక్ స్క్రిప్ట్. ఈ చిత్రానికి ఆకాశమే హద్దు. మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందో మీ ఊహకు కూడా అందదు. మేం చాలా నమ్మకంతో ఉన్నాం. మీ అంచనాలు మించే ఉంటుంది.' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మూవీపై హైప్ రెండింతలైంది.ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ అనుకుంటున్నట్లు చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. 'ఎన్టీఆర్‌నీల్' వర్కింగ్ టైటిల్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

తాజాగా, మూవీ టైటిల్‌పై అడిగిన ప్రశ్నకు సైతం నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. 'ప్రదీప్ రంగనాథన్ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది. డ్రాగన్ అనే టైటిల్ తమిళంలో వాడేశారు. మరి ఎన్టీఆర్ నీల్ సినిమాకు తమిళంలో ఏమైనా డిఫరెంట్ టైటిల్ ఉండబోతుందా.?' అన్న ప్రశ్నకు.. 'ఎన్టీఆర్ నీల్ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్‌తో కూడిన డ్రాగన్. ఈ సినిమాను తక్కువ చేయాలని కాదు. ఇది ఈ జోనర్‌లో ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్. ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్ వేరే లెవల్. డ్రాగన్ టైటిల్ హిట్ కావడం ఇంకా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఆ పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తుంది.' అని రవిశంకర్ పేర్కొన్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ 'డ్రాగన్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు, ఎన్టీఆర్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని మాస్ పాత్రలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. దాదాపు రూ.360 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తుండగా ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించనున్నారు. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: