టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ "పెళ్లి చూపులు" అనే మూవీ తో హీరో గా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయనకు మంచి విజయాలు చాలానే దక్కాయి. దానితో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తక్కువ కాలం లోనే ఈయనకు అద్భుతమైన గుర్తింపు లభించింది . కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి విజయ్ కి భారీ అపజయాలు దక్కుతున్నాయి. ఈయన ఆఖరుగా ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి భారీ అపజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈయన లైనప్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే విజయ్ దేవరకొండ "రాజా వారు రాణి గారు" మూవీ దర్శకుడు అయినటువంటి రవి కిరణ్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

దిల్ రాజు నిన్న ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్దన్ అనే టైటిల్ తో మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ , రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇలా విజయ్ ముగ్గురు క్రేజీ దర్శకులతో తన తదుపరి మూడు మూవీలు చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd