
అయితే మరి కొన్నిసార్లు వీరు చేస్తున్న పనులకు అన్ని రూమర్సే అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఇటీవలే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ చాలా రోజుల తర్వాత జంటగా కనిపించారు. అది కూడా బాలీవుడ్ డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ కుమారుడు పెళ్లిలో వీరు కనిపించడం జరిగింది.. దీంతో అక్కడ వీరు చాలా అట్రాక్షన్ గా కనిపించడంతో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఖుషి అవుతూ గత కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల రూమర్స్ కి ఇలా చెక్ పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జీన్స్ సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన ఐశ్వర్యారాయ్ ఆ తర్వాత రోబో చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. పోన్నియన్ సెల్వన్ 1,2 వంటి చిత్రాలలో కూడా నటించి మరొకసారి అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. 2023 తర్వాత మళ్లీ ఎలాంటి కొత్త సినిమాలు కూడా ప్రకటించలేదు ఐశ్వర్యారాయ్. మరి ఈసారి ఎలాంటి సినిమాతో వస్తుందో అంటే అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అభిషేక్ బచ్చన్ కూడా అడపాదడపా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లు ఏదైనా సినిమా వస్తే బాగుంటుందని అభిమానులైతే తెలుపుతున్నారు. మొత్తానికి విడాకుల విమర్శ పై ఎట్టకేలకు ఇలా ఫోటోలతో క్లారిటీ వచ్చేసింది.