తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించాడు. కానీ వాటి ద్వారా ఈయనకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. అలాంటి తరుణం లోనే ఈయన డిజె టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా సిద్దు కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

మూవీ తర్వాత మూవీ కి కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో సిద్దు హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఇకపోతే ప్రస్తుతం సిద్దు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ఒక సినిమా జాక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి పాబ్లో విరుడ అంటూ సాగే పాటను మార్చి 7 వ తేదిన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ వంటి వరుస విజయాల తర్వాత సిద్దు నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం సిద్దు "జాక్" మూవీ తో పాటు తెలుసు కదా అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: