టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన వరస పెట్టి ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే తాజాగా దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ , విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలను నిర్మించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల అయ్యాయి. ఇందులో గేమ్ చేంజర్ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహ పరచగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు పాత్రికేయులతో ముచ్చటించాడు. అందులో భాగంగా దిల్ రాజుకు మీరు ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు రెండు సినిమాలను విడుదల చేశారు. అందులో ఓ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కాగా , మరో సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఫెయిల్యూర్ అయిన సినిమా ద్వారా మీకు నష్టాలు వచ్చాయా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ ... నేను ఎప్పుడూ కూడా ఒక సినిమా హిట్ అయ్యిందా ... ఫ్లాప్ అయ్యిందా ... ఒక మూవీ ద్వారా లాభాలు వచ్చాయా ... నష్టాలు వచ్చాయా అనేది పెద్దగా పట్టించుకోను. నేను ఒక సంవత్సరం మొత్తంలో ఎన్ని సినిమాలు నిర్మించాను ... డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ సినిమాల ద్వారా లాభం వచ్చిందా ... నష్టం వచ్చిందా. మొత్తంగా ఒక సంవత్సరంలో లాభాలు వచ్చాయా ... నష్టాలు వచ్చాయా అనే దానిని మాత్రమే చూస్తాను అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: