మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో రవితేజ ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది ఎంతో గ్రాండ్ తెరకెక్కిన “మిస్టర్ బచ్చన్“ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సినిమాకు ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం రవితేజ 'మాస్‌ జాతర' అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.మే 9న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాలో రవితేజ సరసన క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోయే సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతుంది..

నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి వంటి క్లాస్‌ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల కథను రవితేజ ఓకే చేశారని న్యూస్ వైరల్ అవుతుంది..అయితే కిశోర్‌ తిరుమల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి..మరి రవితేజ వంటి మాస్‌ హీరతో ఈ క్లాస్ డైరెక్టర్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..

కిషోర్ తిరుమల రవితేజతో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నట్లు సమాచారం..ఈ సినిమాకు “ అనార్కలి “ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం..అలాగే ఈ మూవీలో లేటెస్ట్ ట్రెండింగ్ హీరోయిన్స్ అయిన కయాదు లోహర్, మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది..త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సమాచారం..ఈ ఏడాది ఈ సినిమాను గ్రాండ్ ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: