మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న వేషాలను దక్కించుకున్నాడు. అలా తాను నటించిన సినిమాలో చిన్న పాత్రలతో అయినా కూడా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ఈయనకు సినిమాల్లో కీలక పాత్రలలో , విలన్ పాత్రలలో అవకాశాలు వచ్చాయి. అలా కొంత కాలం పాటు కెరియర్ను కొనసాగించిన ఈయనకు ఆ తర్వాత హీరో పాత్రలలో అవకాశాలు రావడం , ఈయన హీరోగా నటించిన సినిమాలు చాలా వరకు విజయాలు సాధించడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.

ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రవితేజకు వరస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం రవితేజ హీరో గా రూపొందిన ఓ సూపర్ హిట్ సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ ను రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మాస్ జాతర సినిమాలో రవితేజ హీరోగా రూపొందిన ఇడియట్ మూవీ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి అనే సాంగ్ ను రీమిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సాంగ్ ఆ సమయంలో యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం యూత్ ను ఆకట్టుకోవడం కోసమే ఈ సాంగ్ ను మేకర్స్ రీమేక్ చేస్తున్నారు అని అభిప్రాయాలను కొంత మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: