కొంత కాలం క్రితం హృతిక్ రోషన్ హీరోగా వార్ అనే సినిమా హిందీ లో వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న వార్ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం వార్ 2 అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దానితో ఈ మూవీ షూటింగ్ను త్వరగా పూర్తి చేసి , పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని యాక్షన్ సన్నివేశాలలో కూడా ఈ మూవీ లో సముద్రంపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని మేకర్స్ డిజైన్ చేసినట్లు , అది అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రంపై ఉండే యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ కానున్నట్లు , ఆ యాక్షన్ సన్నివేశం వల్ల సినిమా రేంజ్ మరింత పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మూవీ లో సముద్రంపై యాక్షన్ సన్నివేశం హృతిక్ , తారక్ మధ్య ఉంటుందా ... లేక వీరిద్దరూ కలిసి వేరే గ్యాంగ్ పై అటాక్ చేస్తారా అనేది జనాల్లో సస్పెన్స్ గా మారింది. ఇకపోతే హృతిక్ , తారక్ ఇద్దరు అద్భుతమైన డాన్సర్స్ కావడంతో వీరిద్దరిపై ఒక అద్భుతమైన డ్యాన్స్ నెంబర్ ను కూడా మేకర్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: