మీనాక్షి చౌదరి.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒకటే మారుమ్రోగిపోతున్న పేరు ఇది. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి . ఇండస్ట్రీలో వేరే లెవెల్ స్థానం దక్కించుకుంది . రీసెంట్గా రిలీజ్ అయిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  అంతేకాదు ఇప్పుడు ఆమె చేతుల్లో అరడజనుకి పైగానే సినిమాలు ఉన్నాయి .


బడా బడా స్టార్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . అయితే మీనాక్షి చౌదరినటించిన సినిమాలు హిట్ అవుతున్నా సరే ఆమెకి స్టార్ అన్న పేరు మాత్రం రావడం లేదు. ఆమె నటిస్తున్న సినిమాలలో ఆమె చేసే క్యారెక్టర్ చిన్నదిగా ఉండడం ..లేకపోతే ఇద్దరు హీరోయిన్స్ గా ఉండి మిగతా క్రేజ్ మొత్తం కూడా ఫస్ట్ హీరోయిన్ ఎగరేసుకు పోవడం లాంటివి జరుగుతుంది. ఇలా ఆమె నటించిన చాలా సినిమాల విషయంలో జరిగింది. మరీ ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ అయిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా రిలీజ్ అయిన టైంలో ఐశ్వర్య రాజేష్ గురించే ఎక్కువగా జనాలు మాట్లాడుకున్నారు.  ఎవరో అరాకొరా మాత్రమే మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకున్నారు.



అదే కాకుండా రీసెంట్గా ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేశారు అని అంతా అనుకోని లాస్ట్ లో అదంతా ఫేక్ అంటూ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వడం ఆమె పరువు పోయినట్లయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు మీనాక్షి చౌదరికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను బాగా వైరల్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. అంతేకాదు పాన్ ఇండియా స్టార్స్ కూడా ఆమె పేరే జపిస్తున్నారు. చూడాలి మరి ఆమె కెరీర్ ఎలా ముందుకు వెళ్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: