టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్, బన్నీ వాసు గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరు చాలా పగడ్బందీ గానే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవలే బన్నీ వాసు చేసిన పని వల్ల తండేల్ సినిమా కలెక్షన్స్ పైన భారీగా దెబ్బ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో డైరెక్టర్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించారు. సుమారుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం పైరసీ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చేసిన వ్యాఖ్యల వల్ల కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడిందని తెలియజేశారు బన్నీ వాసు.


తండేల్ సినిమా వచ్చి రెండు రోజులు కాకముందే ఆన్లైన్లో ప్రింట్లో రావడంతో చిత్ర బృందం వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి తండేల్ చిత్రాన్ని పైరసీ చేస్తున్న వెబ్సైట్స్, టెలికాం గ్రూప్స్, వాట్సాప్ సంస్థలకు ఇదే మా హెచ్చరిక అందరి పైన కేసులు పెడతామంటూ తెలిపారు. అయితే ఇలా ప్రెస్ మీట్ పెట్టడం వల్లే చాలా నష్టపోయామంటూ బన్నీ వాసు తెలియజేశారట. మరి ఆ నష్టం ఎలా జరిగిందో చూద్దాం..


బన్నీ వాసు ఇలా మాట్లాడుతూ తండేల్ హెచ్డి వర్షన్ లో అందుబాటులోకి తీసుకురావడంలో సైబర్ నేరగాళ్లకు వార్నింగ్ ఇచ్చారు.. ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్లే తమకి నష్టం జరిగిందని ఈ ప్రెస్ మీట్ పెట్టకముందు వరకు తండేల్ హెచ్డి ప్రింట్ లీక్ అయిందని విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. మేం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్లే చాలామందికి ప్రచారం చేసినట్టుగా మారిందంటూ తెలియజేశారట. అందుకే ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇప్పటికీ ఒక తప్పుగా భావిస్తున్నాను అంటూ బన్నీ వాసు వెల్లడించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: