టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుధీర్ బాబు ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఈయనకు ఒకటి , రెండు సినిమాల ద్వారా మినహాయిస్తే వేరే మూవీల ద్వారా మంచి విజయాలు బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు. అయినా కూడా ఈయన ఎక్కువ శాతం రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో కాకుండా వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ రావడం వల్ల ఈయనకు అపజయాలు వచ్చిన కూడా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన జటాధార అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి సోనాక్షి సిన్హా ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో పాత్ర కోసం సోనాక్షి సిన్హా ను సంప్రదించగా కథ మొత్తం విన్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే సోనాక్షి సిన్హా , సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస విజయాలు దక్కడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

కానీ ప్రస్తుతం మాత్రం ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో పెద్దగా విజయాలు దక్కడం లేదు. ఇక ఈమె సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న జటాధార సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే ఈమెకి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: