యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ఎక్కువ భాగం సముద్రంపై ఉంటుంది. ఈ మూవీ లో సముద్రంపై అనేక యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ మూవీ లో సముద్రంపై వచ్చే యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. దానితో ఈ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది.

మూవీ మంచి కలక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ లో కూడా సముద్రంపై ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశం మూవీ కే హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే దేవర మూవీ ని సముద్రపు బ్యాక్ డ్రాప్ లో రూపొందించి తారక్ అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నా వార్ 2 మూవీలో కూడా సముద్రంపై ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న డ్రాగన్ మూవీ కూడా సముద్రపు బాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న తారక్ , ప్రశాంత్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: