‘యానిమల్’ ‘పుష్ప 2’ ‘సికిందర్’ మూవీలు వరస బ్లాక్ బష్టర్ హిట్స్ గా మారడంతో బాలీవుడ్ ఇండస్ట్రీని రష్మిక మ్యానియా షేక్ చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక గోల్డెన్ లెగ్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమె వరస ఫ్లాప్ లతో సతమతమవుతున్న బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ తో జతగట్టి నటిస్తున్న ‘సికిందర్’ మూవీ వచ్చేనెల రంజాన్ కు విడుదల కాబోతోంది.



దర్శకుడు మురగ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ఒక పాటకు సంబంధించిన ప్రోమో న్ లేటెస్ట్ గా విదుదల చేశారు. ఈ పాట ప్రోమో విడుదలైన వెంటనే విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సల్మాన్ శరీరాన్ని విఎఫ్ఎక్స్ లో ఎడిటింగ్ చేశారని జాగ్రత్తగా గమనించిన వారికి తెలిసి పోవడంతో వారంతా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.



అంతేకాదు మొహానికి దేహానికి మధ్య ఉన్న ప్యాచ్ స్పష్టంగా కనిపిస్తుందని ఆధారాలతో సహా కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాటలో సల్మాన్ పక్కన నటించిన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న లుక్స్ పై కూడ సెటైర్లు పడుతున్నాయి. దీనితో వీరిద్దరి కామనేషన్ ప్రేక్షకులకు నప్పదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సల్మాన్ సినిమా రంజాన్ కు విడుదల అయితే అది సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ గతంలో ఉండేది. అయితే ఇదే రంజాన్ సీజన్ కు విడుదలైన ‘రేస్ 3, ‘ట్యూబ్ లైట్’ లాంటి సినిమాలు భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో సల్మాన్ కు రంజాన్ సెంటిమెంట్ ప్రస్తుతం వర్కౌట్ కావడం లేదు.



ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న రంజాన్ సల్మాన్ కు ఎలాంటి లక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈమధ్య కాలంలో రష్మిక తరుచు వివాదాలలో చిక్కుకుంటోంది. లేటెస్ట్ గా రష్మిక పై కన్నడ మీడియా చాల ఆగ్రహాంగా ఉంటుంన్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: