
ఇలా ఆన్ లైన్ లో లీక్ అవుతున్న సినిమాల ప్రింట్స్ హై క్వాలిటీలో ఉండటంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ధియేటర్లకు రావడం అనవసరం అన్న భావనలో నెటితరం ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గేమ్ ఛేంజర్’ హై క్వాలిటీ ప్రింట్ తో ఆన్ లైన్ లో విడుదలైన రోజు లీక్ అవ్వడంతో దిల్ రాజ్ ఈపైరసీని అడ్డుకట్ట వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆన్ లైన్ లీకుల పై గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ జరగవలసిన డామేజ్ అంతా జరిగిపోయింది.
దీనితో ఇలాంటి పైరసీలకు అడ్డుకట్ట వేయాలి అంటే ఇండస్ట్రీ అంతా ఒక తాటి పై నిలబడితే కాని ఈపైరసీని అడ్డుకట్టవేయలేరు అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు. ఈసమస్య పై దిల్ రాజ్ ఒక మీడియా సమావేశంలో స్పందించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఈ కామెంట్స్ చేశారు. ప్రతి శుక్రవారం ఎవరి నొప్పి వాళ్ళదనే తరహాలో ఇండస్ట్రీలోని అందరు ఎదువాడి గురించి పట్టించుకోనంత కాలం ఈసమస్యకు పరిష్కారం ఉండదు అని ఆయన అభిప్రాయ పడ్డారు.
అందరూ కలిసికట్టుగా ఒక ఉద్యమంలా నడుం బిగిస్తే తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కరం దొరకదని దిల్ రాజ్ అభిప్రాయం. పైరసీ చేసిన వాళ్ళను పట్టుకోవడం కానీ లేదా దాని మూలాలను వెతికేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కానీ ఈసమస్యకు పరిష్కారం దొరుకుందని పైరసీ చేసిన సినిమాను డౌన్లోడ్ చేసుకున్నాడ డౌన్ లోడ్ చేసుకున్న వారిపై కూడ కేసులు పెడతామని ఆచారణలోకి తెచ్చినప్పుడు మాత్రమే ఈసమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అంటున్నారు..