కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీలా హీరోయిన్గా ధమాకా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ... ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో శ్రీ లీలా తన అద్భుతమైన డ్యాన్స్ తో నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం , ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించడం జరుగుతుంది. ఇకపోతే తాజాగా ధమాకా మూవీ రైటర్ అయినటువంటి ప్రసన్న కుమార్ బెజవాడ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయనకు ధమాకా మూవీ శ్రీ లీలా వల్లే హిట్ అయ్యిందా ..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ప్రసన్న కుమార్ బెజవాడ సమాధానం ఇస్తూ ... శ్రీ లీలా "ధమాకా" సినిమాలో అద్భుతంగా డాన్స్ చేసింది ... నటించింది ... అనేది వాస్తవం. కానీ తన వల్ల మాత్రమే సినిమా హిట్ అయింది అనేది వాస్తవం కాదు. అందులో రవితేజ గారు కూడా అద్భుతంగా చేశారు.

అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అద్భుతంగా పని చేశాయి. శ్రీ లీల వల్ల మాత్రమే సినిమా హిట్ అయింది అంటే ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించింది. అందులో కూడా అద్భుతమైన డాన్స్ చేసింది , అద్భుతంగా నటించింది. కానీ అన్ని సినిమాలు ధమాకా స్థాయి విజయాలను అందుకోలేదు. దాని వల్లే మనకు అర్థం అవుతుంది సినిమా కేవలం ఒకరి వల్లే హిట్ కాలేదు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pkb