రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యం చాలా రోజుల నుండి బాగాలేదనే సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే బాహుబలి సినిమాలో నటించాడో అప్పటినుండి ఆయన ఆరోగ్యం పదేపదే పాడవుతుంది.ఇప్పటికే చాలాసార్లు ఆయన మోకాలికి సర్జరీ వంటివి చేయించుకున్నారు. ఇక ఇండియాలో ఇలాంటి సర్జరీలు చేయించుకుంటే బయటపడుతుంది అనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హెల్త్ కాపాడుకోవాలి అనుకుంటున్నప్పటికీ ప్రభాస్ కి ప్రతిసారి ఎదురుదెబ్బే తగులుతుంది.ఎందుకంటే ప్రతిసారి ప్రభాస్ అనారోగ్యంతో హాస్పిటల్ బారిన పడుతున్నారు.ఇప్పటికే పలుమార్లు ప్రభాస్ విదేశాల్లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు వీడియోలు చక్కర్లు కొట్టాయి.అయితే తాజాగా మళ్ళి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ ప్రభాస్ కి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో చికిత్స తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.దానికి ప్రధాన కారణం ప్రభాస్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మీది అంతస్తు నుండి కింది అంతస్తుకి దూకే సమయంలో ఆయన కాలుకి తీవ్ర గాయం అయిందని, ఆ గాయం కారణంగానే ప్రభాస్ హాస్పిటల్ పాలయ్యారని తెలుస్తోంది. అయితే షూటింగ్ సమయంలో ఈ గాయం జరిగిందా ఇంట్లో ఉన్నప్పుడే జరిగిందా అనేది తెలియదు. కానీ ఈ గాయం కారణంగా ప్రభాస్ ప్రస్తుతం బెడ్ మీద నుండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారట. అయితే ఇండియాలో ప్రభాస్ కి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో ఇటలీ తీసుకువెళ్లి ప్రభాస్ కి మెరుగైన చికిత్స అందిస్తున్నారట.

అయితే ఈ విషయం బయట ఎక్కడ లీక్ అవ్వకుండా ప్రభాస్ పీ.ఆర్.టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తన కాలికి గాయమైందో అప్పటినుండి అదే కాలికి పదేపదే గాయం అవుతూ వస్తుంది.ఇప్పటికే సర్జరీలు చేసినా కూడా ఆ గాయం మానడం లేదు.ఇక ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చూస్తుంటే వేణు స్వామి చెప్పిందే నిజమవబోతుందా ప్రభాస్ కి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వేణుస్వామి ఎప్పటినుండో చెబుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి చూస్తే ఆయన చెప్పిందే నిజమవబోతుంది అనిపిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: