సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది కి విజయాలు దక్కితేనే క్రేజీ సినిమాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ మరి కొంత మంది కి మాత్రం నటించిన సినిమాలతో వరుస అపజయాలు దక్కిన కూడా క్రేజీ సినిమాల్లో అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిలో మిస్ వరల్డ్ మనిషి చిల్లర్ ఒకరు. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ హీరో గా రూపొందిన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ హిందీ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈమె తన కెరీర్లో మూడవ సినిమాగా టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన ఆపరేషన్ వాలెంటీన్ మూవీ లో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.

ఇక ఈ నటి కొంత కాలం క్రితం బడే మియా చోటే మియా అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఇప్పటి వరకు ఈ బ్యూటీ మొత్తం నాలుగు సినిమాల్లో నటిస్తే ఈ నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక నటించిన నాలుగు సినిమాలతో అపజయాలను అందుకున్న కూడా ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. దానితో ఈమెకు వరుస పెట్టి ఫుల్ క్రేజీ సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc