
మనకు తెలిసిందే ప్రెసెంట్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లతో అక్కినేని ఫ్యామిలీ హోరెత్తిపోతుంది. ఎటు చూసినా పండగలే ఎటు చూసినా సెలబ్రేషన్స్ . ఒకపక్క ఇంటి పెద్ద కోడలు త్వరలోనే ఇంటి చిన్న కోడలు కూడా రాబోతుంది . ఇలా ఫుల్ హంగామ హంగామా గా అక్కినేని ఫ్యామిలీ సిచువేషన్ ఉంది . అయితే ఇలాంటి మూమెంట్లోనే నాగార్జున తన 100వ సినిమాకి సంబంధించిన కీలక డెసిషన్ కూడా తీసుకున్నారట. నాగార్జున డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన వందవ సినిమాని కమిట్ అయ్యాడట .
ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని మొదటగా అనుకున్నారట . ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష తో పాటు మీనాని కూడా అనుకున్నారట. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కోసం అమల ని కూడా చూస్ చేసుకున్నారట . అమలా - నాగార్జున కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆ కారణంగానే వీళ్ళ కాంబో రిపీట్ చేయాలి అంటూ జస్ట్ ఒక రెండు నిమిషాలు మెరిసే పాత్ర కోసం అమలను ఓకే చేశారట . తెర పై అమల నాగార్జున కలిసి నటిస్తే కుర్రాళ్ళకి పూనకాలు వచ్చేయవు అంటూ మాట్లాడుకుంటున్నారు అక్కినేని అభిమానులు..!