మహేష్ రాజమౌళి కాంబో మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒరిస్సాలో జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంత కష్టపడినా లికులను ఆపే విషయంలో రాజమౌళి సక్సెస్ కాలేకపోతున్నారు.
 
రాజమౌళి ఈసారి కూడా ఔట్ డోర్ షూటింగ్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజమౌళి ఈ సినిమాలో పూర్వ కాలంలో కాశీ ఏ విధంగా ఉందో చూపించనున్నారని తెలుస్తోంది. కల్కి సినిమా సైతం కాశీ ప్రధానంగా తెరకెక్కగా జక్కన్న సైతం ఈ విషయంలో నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్నారా అనే చర్చ జరుగుతోంది.
 
మహేశ్ రాజమౌళి కాంబో మూవీ 2027 సెకండాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జక్కన్న గత సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి సందేహాలు అవసరం లేదని భోగట్టా. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల సమయం కేటాయించనున్నారు. మహేష్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబో అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తుండగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ మరింత కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త కథలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ సినిమలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.


 
 


మరింత సమాచారం తెలుసుకోండి: