ఆ హీరోకి 300కు పైగా మంది హీరోయిన్లతో, అమ్మాయిలతో ఎఫైర్ ఉంది.కానీ అయినా ఆ హీరో అంటేనే నాకు ఇష్టం అంటుంది పవన్ కళ్యాణ్ బ్యూటీ. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ హీరోని ఇష్టపడుతున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. 300 మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్న ఆ హీరో అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మాత్రమే. ఇక సంజయ్ దత్ ని అంతగా ఆరాధించే, ప్రేమించే ఆ హీరోయిన్ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ బద్రి మూవీ హీరోయిన్ అమీషా పటేల్. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అమీషా పటేల్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అమీషా పటేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నేను సంజయ్ దత్ ఇంటికి వెళితే పొట్టి బట్టలు అస్సలు వేసుకోను.

ఎందుకంటే ఆయన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకొని వస్తే అస్సలు ఇష్టపడడు.వెంటనే ఒళ్ళు కనిపించకుండా బట్టలు వేసుకోని రా అని చెబుతాడు. అంతే కాదు నేను ఎప్పుడూ ఆయన ఇంటికి వెళ్లినా కూడా సల్వార్లు ధరించి ఒళ్ళు కనిపించకుండా ఉండే బట్టలే వేసుకు వెళ్తాను. ఇక సంజయ్ దత్ నాకు చాలా దగ్గరి వాడు.అంతేకాదు ఆయనే నాకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తానని,అలాగే కాళ్లు కడిగి కన్యదానం కూడా చేస్తానని చాలా సార్లు చెప్పేవారు. అంత మంచి అనుబంధంగా ఉంది మా మధ్య. ఇక నా బర్త్ డే ని కూడా చాలా సార్లు నేను సంజయ్ ఇంట్లోనే చేసుకున్నాను.మా మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది.

సంజయ్ దత్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ అమీషా పటేల్ ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకు వచ్చింది. అలాగే సంజయ్ దత్ కి నేనంటే చాలా ఇష్టమని ప్రతిసారి నేను ఎలా ఉన్నాను, నా యోగక్షేమాలు ఫోన్ చేసి మరీ అడిగి తెలుసుకుంటాడని మా మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అంటూ అమీషా పటేల్ చెప్పుకువచ్చింది. అయితే అమీషా పటేల్ సంజయ్ దత్ కాంబినేషన్లో రెండు మూడు సినిమాలు వచ్చాయి.అలా సినిమాలు చేసే సమయంలోనే వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.కానీ అందరూ అనుకుంటున్నట్లు చెడు రిలేషన్ అయితే కాదు. ఇక అమీషా పటేల్ తెలుగులో పవన్ కళ్యాణ్ తో బద్రి, జూనియర్ ఎన్టీఆర్  నరసింహుడు, బాలకృష్ణతో పరమవీరచక్ర, మహేష్ బాబు తో నాని వంటి సినిమాల్లో నటించింది

మరింత సమాచారం తెలుసుకోండి: