తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో వరస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు. దానితో చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో పూరి జగన్నాథ్ స్టార్ దర్శకుడి స్థాయికి ఎదిగాడు. టాప్ దర్శకుడి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కొంత కాలం పాటు ఆయన అలాంటి రేంజ్ నే మైంటైన్ చేస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ కి వరుస పెట్టి అపజయాలు దక్కుతున్నాయి.

కొంత కాలం క్రితం ఈయన ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన లైగర్ , డబల్ ఇస్మార్ట్ సినిమాలు ఘోర పరాజయాలను ఎదుర్కున్నాయి. తర్వాత పూరీ జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. గోపీచంద్ తో ఇది వరకు పూరి జగన్నాథ్ గోలీమార్ అనే సినిమా రూపొందించాడు. ఇక పూరి జగన్నాథ్ , గోపీచంద్ "గోలీమార్" మూవీ కి కొనసాగింపుగా గోలీమార్ 2 అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే మరి కొంత మంది పూరి జగన్నాథ్ , అఖిల్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని , దానికి ప్రధాన కారణం అపజాలతో సతమతం అవుతున్న అఖిల్ వరుస ఫ్లాప్ లలో ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా చేసే ఛాన్సెస్ చాలా తక్కువ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీ ని గోపీచంద్ లేదా అఖిల్ తో చేస్తాడా ... లేక వేరే హీరోతో చేస్తాడా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: