ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఆసక్తికర మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నాగబాబు త్వరలో మంత్రి కానున్న నేపథ్యంలో ఆయనకు అప్పగించే శాఖ గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ఉగాది సమయానికి నాగబాబు మంత్రి మండలిలోకి ప్రవేశించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
 
అయితే నాగబాబుకు క్రీడా మంత్రిత్వ శాఖల్ని ఇవ్వనున్నారని ఈ శాఖ ఇవ్వడం ద్వారా గతంలో ఈ శాఖకు మంత్రిగా వ్యవహరించిన రోజాను టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది. గతంలో ఈ శాఖకు రోజా మంత్రిగా పని చేసిన సమయంలో రోజా అవినీతి చేశారని కొన్ని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నాగబాబు మంత్రిగా పదవి స్వీకరిస్తే రోజా అవినీతి గురించి కూడా వెలుగులోకి తెచ్చే ఛాన్స్ అయితే ఉంది.
 
జబర్దస్త్ షోకు నాగబాబుతో పాటు రోజా కూడా జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోజా కంటే నాగబాబుకే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చారని గతంలో వార్తలు వినిపించాయి. నాగబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజాకు చుక్కలు చూపించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజా కెరీర్ ప్రస్తుతం ఒకింత దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే.
 
రోజా కెరీర్ పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నా పరిస్థితులు అయితే అనుకూలించడం లేదు. మరికొన్ని సంవత్సరాల పాటు రోజాకు కష్టాలు తప్పవని తెలుస్తోంది. రోజాకు సినిమాలలో సైతం ఆఫర్లు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే. గతంతో పోల్చి చూస్తే రోజా విమర్శలను సైతం తగ్గించారు. సరైన దారిలో అడుగులు వేస్తే మాత్రమే రోజాకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రోజా నోటిదూలే ఆమె కష్టాలకు కారణమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోజా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: