ఫైనల్లీ .. రాజమౌళి ఇన్నాళ్లకు తన కోరిక నెరవేర్చుకోబోతున్నారట.  ప్రజెంట్ ఈ న్యూస్ పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ రాజమౌళి అంటేనే పాన్ ఇండియా డైరెక్టర్ . ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా సరే ఆ రేంజ్ లో ఆ లెవెల్ లోనే వైరల్ అవుతూ ఉంటుంది . రీసెంట్ గా సోషల్ మీడియాలో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది . దానికి కారణం ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన అనుకున్న హీరోయిన్ తో వర్క్ చేస్తున్నారు .


అది కూడా ఆయన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్ బాబు ఫిలిం కోసం.  ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో ఒక బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సర వేగంగా కంప్లీట్ చేసేస్తున్నాడు రాజమౌళి . అంతే కాదు ఆయన ఎంత కఠినంగా ఉన్నా కూడా కొన్ని కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయిపోతున్నాయి . రీసెంట్ గానే మహేష్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో లీకై ఎంత వైరల్ అయ్యాయి అన్న విషయం అందరికీ తెలుసు .



కాగా ఇప్పుడు ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం తాను ఎంత ఇష్టపడే హీరోయిన్ నిత్యామీనన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ బయటకు వచ్చింది . నిజానికి ఈ సినిమాలో గెస్ట్ పాత్రల కోసం దాదాపు పది మంది హీరోయిన్లను చూస్ చేసుకున్నారట రాజమౌళి . అందులో ఒకరుగా నిత్యామీనన్ సెలెక్ట్ అయ్యిందట. నిత్యామీనన్ యాక్టింగ్ రాజమౌళికి చాలా చాలా ఇష్టం . ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు . ఇన్నాళ్లు నిత్యామీనన్ తో సినిమా తెరకెక్కించలేకపోయాడు రాజమౌళి . ఫైనల్లీ తాను ఇష్టపడిన హీరోయిన్ తో ఒక సినిమాలో అట్లీస్ట్ గెస్ట్ పాత్ర అయిన చేయించబోతున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి రాజమౌళి - నిత్యామీనన్ ని ఏ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడో..? ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: