తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి ఇప్పటి వరకు తన కెరీర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. అందులో కొన్ని మూవీ లు అద్భుతమైన విజయాలను సాధిస్తే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను అందుకున్న మూవీ లు కూడా ఉన్నాయి. ఇకపోతే చిరంజీవిసినిమా కథను రిజెక్ట్ చేయగా దానిని జూనియర్ ఎన్టీఆర్ పై రూపొందించగా ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుందట. మరి చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీ ఏది ..? జూనియర్ ఎన్టీఆర్ కి ఏ మూవీ తో అపజయం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి పూరి జగన్నాథ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఆంధ్రావాలా అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీయర్లో మొట్ట మొదటి సారి తండ్రి , కొడుకుల పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను మొదట పూరి జగన్నాథ్ , తారక్ తో కాకుండా చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవి ని కలిసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న చిరంజీవిసినిమా చేయలేను అని చెప్పేసాడట. దానితో పూరి జగన్నాథ్ అదే కథను తారక్ కి వివరించగా ఆయనకు మాత్రం ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చిరంజీవి రిజెక్ట్ చేసిన ఈ మూవీ లో తారక్ హీరో గా నటించగా ... ఈ మూవీ ద్వారా ఆయనకు భారీ అపజయం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: