కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు సినీ పరిశ్రమలో 100 కోట్ల కలెక్షన్లు స్టార్ హీరోలు నటించిన సినిమాలకే ఎక్కువ శాతం వస్తూ ఉండేవి. ఏదో ఒకటి , రెండు మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన సందర్భంలో 100 కోట్ల కలెక్షన్లు వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో కాస్త బాగుంది అని టాక్ వచ్చినా కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా 100 కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే మీడియం రేంజ్ హీరోలు నటించిన ఎన్నో తెలుగు సినిమాలు 100 కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టాయి.

దానితో నిర్మాతలు కూడా మీడియం రేంజ్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. ఇక ప్రస్తుతం మన తెలుగు మీడియం రేంజ్ హీరోలు చాలా మంది అనేక భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాని ప్రస్తుతం హిట్ ది థర్డ్ కేస్ , ది ప్యారడైజ్ అనే మూవీలలో నటిస్తున్నాడు. ఇందులో హిట్ 3 మూవీ మామూలు బడ్జెట్ తోనే రూపొందుతున్న , ది ప్యారడైజ్ మూవీ ని మాత్రం భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కూడా అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం తమ్ముడు , రాబిన్ హుడ్ సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు మూవీలపై కూడా నిర్మాతలు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యువ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే మూవీ లో నటిస్తున్నాడు.

మూవీ కోసం నిర్మాతలు ఏకంగా 100 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా మన టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీలకు కనక మంచి టాక్ వచ్చినట్లయితే భారీ మొత్తంలో కలెక్షన్లను ఈ మూవీలు రాబడతాయి అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: